తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పోలింగ్ బూతుల దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుని

టిడిపి నాయకులు దాడికి భయభ్రాంతులకు గురైనటువంటి ఓటర్లు

రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా,
ఈరోజు స్థానిక సంస్థల్లో భాగంగా రైల్వే కోడూరు నాలుగో ఎంపిటిసి పరిధిలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న 26 బూత్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు 50 మందికి పైగా టిడిపి అనుచరులు లోపలికి తెచ్చుకొని రావడం జరిగింది, ఇందులో కొంతమంది ప్రెస్ అని జనరల్ ఐడి కార్డు వేసుకొని , కాంగ్రెస్ పార్టీ జనరల్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయగా , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతయ్య, నాలుగో ఎంపీటీసీ అభ్యర్థి అక్షర, వారి భర్త బాలిశెట్టి హరి , నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని బూత్ లోపలికి వెళ్లి అల్లరి మూకలను చల్లా చెదురుచేసి చేశారు.
అనంతరం గంట వ్యవధి తర్వాత కోడూరు ఎస్సై శివప్రసాద్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జనరల్ ఏజెంట్ అయిన వ్యక్తి బాలేశెట్టి హరి నీ కోడూరు టోల్గేట్ వద్ద ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూటమి ప్రభుత్వం సహకారంతో స్టేషన్ కు తరలించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు N శాంతయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ గోసాల దేవి, ఎంపీటీసీ అభ్యర్థి బాలిశెట్టి అక్షర, యూత్ కాంగ్రెస్ నియోజవర్గ అధ్యక్షులు కాసల బాలు, సిగమాల రవి, పోలీసులను అడ్డుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ
      పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలియజేశారు.
          అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిజాయితీగా ఎన్నికలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని , కేవలం రిగ్గింగ్ తో , బెదిరింపులతో పోలీసు వ్యవస్థను ,ఎన్నికల నిర్వహణ అధికారాలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలిపారు.